పాన్ ఇండియా స్టార్ కాదు ప్రభాస్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారని సమాచారం.

ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ హీరోగా మారిన ప్రభాస్ తో మూవీ చేయాలంటే కనీసం నాలుగు వందల కోట్లు కావాలని తెలుస్తుంది. రాధే శ్యామ్ నుండి స్పిరిట్ మూవీ వరకు ప్రభాస్ చేస్తున్న ఐదు చిత్రాల బడ్జెట్ లెక్కేస్తే అటూ ఇటూ గా రూ. 2000 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.. అదట ఆయన రేంజ్. విదేశాలలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ప్రస్తుత రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందని సమాచారం.. బాలీవుడ్ రేంజ్ కూడా దాటేసిన ప్రభాస్ ఇప్పుడు హాలీవుడ్ హీరోల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం .

మొన్నటి వరకు సినిమాకు రూ. 100 కోట్లు తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తున్న రెండు స్ట్రైట్ ఫిలిమ్స్ కి గాను రూ. 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తుంది.దర్శకుడు ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ చిత్రాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 150 కోట్లని సమాచారం.. బడ్జెట్ రీత్యా ప్రభాస్ అంత మొత్తంలో తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీనిపై బాలీవుడ్ మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుండగా అక్కడి టాప్ స్టార్స్ కూడా నోరెళ్ల బెడుతున్నారని సమాచారం.. ఇండియాలో వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలుగా సల్మాన్, అక్షయ్ కుమార్ మరియు రజినీకాంత్ రికార్డులకు ఎక్కారని ఇప్పుడు ప్రభాస్ వాళ్లందరినీ దాటివేశాడని తెలుస్తుంది.

ఇక టాలీవుడ్ లో ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరూ లేరని మహేష్, పవన్ మరియు ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ కూడా రూ. 70 కోట్ల లోపేనని తెలుస్తుంది. అసలు మొన్నటి వరకూ కూడా యాభై కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ప్రభాస్ మినహా ఎవరూ లేరని. దీంతో ప్రభాస్ కి ఒక్క సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్ తో పవన్, మహేష్ మరియు ఎన్టీఆర్ వంటి బడా స్టార్స్ తో మూడు చిత్రాల చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయని తెలుస్తుంది.బాహుబలి చిత్రానికి ముందు ప్రభాస్ ఈ స్టార్స్ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: