చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటులు పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మందికి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. అదృష్టం కలిసి రాక మరికొంత మంది ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్ దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టింది. దివ్యభారతి చిన్న వయస్సులోనే ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించింది. ఆమె తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇది ఇలా ఉండగా అసలు విషయానికి వస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జునతో మినహా మిగిలిన స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 19 సంవత్సరాల వయసులోనే దాదాపు 20 చిత్రాలు నటించి ప్రేక్షకుల నుండి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. దివ్యభారతికి చింతామణి పాత్రలో నటించాలని ఎంతో కోరికగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని నిర్మించాలనిభావించినట్లు సమాచారం.

అయితే 1992లో ఆమె కథానాయికగా 'చింతామణి' షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా మొదలు కాకుండానే ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావించిన సమయంలో దివ్య భారతి ఆకస్మికంగా మరణించడం చేత ఈ సినిమా ఇంతటితోనే ఆగిపోయినట్లు సమాచారం.

అతి చిన్న వయస్సులో 19 సంవత్సరాల వయసుకి దివ్యభారతి మృతి చెందడంతో తీరనిలోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అప్పట్లో ఈమెకు ఎంతో క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే రోజుకు ఆమెకి లక్ష రూపాయల పారితోషికం డిమాండ్ చేసినప్పటికీ నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈమె అడిగిన మొత్తాన్ని చెల్లించేవారని సమాచారం. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివ్యభారతి తన కోరిక నెరవేరకుండానే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: