చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్. ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకునాడు. ఆ తరువాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీస్నేహం వంటి వరుస చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. అంత సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఏమైందో తెలియదు కానీ ఈయనకు వరుసగా అవకాశాలు రావడం తగ్గుపోయాయి. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఉదయ్ కిరణ్ రాసిన చివరి లేక సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూనే ఉంటుంది..

అయితే ఆ లేఖలో ఎం ఉందో ఒక్కసారి చూద్దామా.. 'విషితా.. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. అంతే స్థాయిలో నేను నిన్ను ప్రేమించానని పేర్కొన్నారు. అంతేకాక.. మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారని రాశారు. అయితే వారికి ఈ బాధ ఉండకూడదని అన్నారు. అలాగే నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు.. కానీ అతడు మంచివాడు అస్సలు కాదని రాశారు. అంతేకాదు.. నా మాట విను.. నువ్వు నిజం తెలుసుకునే రోజునీ పక్కన నీ ఉదయ్ ఉండడు అని రాశారు. అంతేకాదు.. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో.. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. అంతేకాక.. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుందని పేర్కొన్నారు.

ఇక లేఖలో అందరూ సంతోషంగా ఉండాలంటే నేను మీ మధ్య ఉండకూడదు అని అనుకుంటున్నాని పేర్కొన్నారు. నాకు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని..  మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు.. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుందని పేర్కొన్నాడు. ఇక అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉందని పేర్కొన్నాడు. ఇక అందుకే నీ దగ్గరికి వస్తున్నా..' అంటూ తన చివరి లేఖను రాశారు. ఇక ఇప్పుడు ఈ లేఖను చదివి ఉదయ్ కిరణ్ అభిమానులు కన్నీరు పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: