జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన విధంగా కథ కూడా సిద్ధం చేయిస్తానని అదేవిధంగా నచ్చిన దర్శకుడు తో సినిమా చేస్తానని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత ఒక కన్నడ దర్శకుడితో కూడా అయిన సినిమా చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సదరు బాలీవుడ్ దర్శకుడు దాదాపు యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని సమాచారం.
అవసరమైతే దాదాపు 20 కోట్ల ముందుగానే అడ్వాన్స్ ఇస్తానని చెప్పినట్లుగా కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడి గురించి అడిగినా సరే కాదు అనుకున్న చేసే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా సిద్ధమైందని అంటున్నారు. దాదాపుగా ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో చేసేందుకు సదరు నిర్మాత రెడీ అవుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా మరో బాలీవుడ్ అగ్రహీరో సినిమా లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.