గత రెండు నెలలుగా తెలుగు సినిమా రంగంలో ఆసక్తి రేపుతున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఒకటి. గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా కు సీక్వెల్ గా తెర‌కెక్కి న‌ దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో గ‌త రాత్రి రిలీజ్ అయింది. ఆరేళ్ల క్రితం క్లోజ్ అయిన ఒక కేసును పోలీసులు మళ్లీ ఓపెన్ చేసి విచారణ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముందుగా దృశ్యం 2 సినిమాకు అంకురార్పణ చేశారు. వాస్తవంగా చూస్తే ఇలాంటి క‌థ‌కు సీక్వెల్ చేయ‌డం చాలా క‌ష్టం అని చెప్పాలి. అయితే దర్శకుడు జీతు జోసెఫ్ అదిరిపోయే స్క్రీన్ ప్లే తో దృశ్యం 2 క‌థ ను అల్లుకున్నాడు.

క‌థ లో అదిరిపోయే మ‌లుపులు ఉన్నాయి. ఇక క‌థ‌లో పోలీసుల కంటే అన్ని విష‌యాల్లోనూ ముందే ఉండ‌డం రాంబాబు స్పెషాలిటీ అని చెప్పాలి. ఆ తెలివే దృశ్యం 1లో త‌న‌ని, త‌న కుటుంబాన్నీ కాపాడు కుంది. అయితే ఇప్పుడు మ‌రోసారి అదే తెలివి తేట‌లు దృశ్య‌మ్ 2లో వాడేశాడు ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్‌. వ‌రుణ్ శ‌వం ఎక్క‌డుంది ? అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయినా.. అది మాత్రం పోలీసుల‌కు తెలియ‌దు. మ‌రి దానిని పోలీసులు ఎలా క‌నుకున్నారు ? అన్న‌ది మ‌రో ట్విస్టింగ్ పాయింట్‌.

ఆ శవం పోలీసుల‌కు దొరికాక కూడా .. ఆ ఆచూకి తెలిశాక కూడా రాంబాబే ఈ హ‌త్య చేశాడ‌ని తెలిసినా కూడా దాని నుంచి ఎలా భ‌యట ప‌డ్డాడు ? అన్న‌దే ఈ క‌థ‌లోని కీల‌క మైన పాయింట్‌. ఈ దృశ్యం 2 సినిమాలో ఈ రెండే కీల‌క మైన పాయింట్స్‌. ఈ రెండిటిని ద‌ర్శ‌కుడు చాలా చాలా బాగా డీల్ చేశాడు. మొత్తం 150 నిమిషాల పాటు ఉన్న సినిమాలో 100 నిమిషాలు తొలి భాగం అంతా స్లో గానే న‌డుస్తుంది. అయితే హ‌త్య చేసిన తాలుకూ భ‌యం రాంబాబు కుటుంబ స‌భ్యుల్ని వెంటాడ‌డం , ఈ టెన్ష‌న్ తోనే సినిమా ఉంటుంది. చివ‌రి 50 నిమిషాలు మాత్రం అదిరిపోయే ట్విస్టుల‌తో సినిమాను హిట్ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: