దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినిమా పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. తొలి సినిమా నుంచి కూడా ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. వెంకటేష్ ఎప్పుడూ కూడా విజయం వచ్చినప్పుడు పొంగిపోలేదు ఓటమి వచ్చినప్పుడు కృంగిపోలేదు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో ఒకరిగా నిలిచాడు.

అందరు హీరోలు కూడా ఒక రకమైన పంథా లో వెళుతుంటే తాను మరొక రకమైన పంథాలో వెళుతూ ఇప్పుడు తనకంటూ విశేషమైన ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ సరికొత్త వెంకటేష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. 60 ఏళ్ల వయసు పై బడిన  వెంకటేష్ ఇప్పటికీ హీరోయిన్లతో రొమాన్స్ లు డాన్స్ లంటూ వెళ్లకుండా తన వయసుకు తగ్గ తన ఫ్యాన్స్ కు తగ్గ సినిమాలను చేస్తూ హీరో గా అత్యున్నత స్థానానికి వెళుతున్నాడు. ఆయన నటించిన గురు నారప్ప అలాగే దృశ్యం వంటి సినిమాలే దీనికి ఉదాహరణలు. 

వెంకటేష్ నటనలో ఎలాంటి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. నటుడిగా ఆయనకు ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు లభించాయి. తండ్రి ప్రశంశే తనకు గొప్ప అవార్డు అని గతంలో వెంకటేష్ చెప్పగా తాజాగా ఆయన హీరోగా నటించిన దృశ్యం సినిమాలో నటించిన తీరు ఎంతో ఉన్నతం గా ఉందని చెప్పవచ్చు. సీక్వెల్ సినిమా అనగానే మొదటి భాగం తాలూకు హావభావాలు యొక్క పాత్ర బరువు ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా నటించాల్సి వస్తుంది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా వెంకటేష్ మొదటి భాగం లోని రాంబాబు పాత్ర యొక్క హావభావాలను పాత్ర తీరు తెన్నులను ఏమాత్రం పక్కదారి పట్టి వెళ్లి పోకుండా ఒదిగిపోయారు. దృశ్యం 2 దర్శకుడు ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: