టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతూ మంచి జోష్ మీద ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. పదాల బాణీని ఆనందించాలి అంటే అందుకు తగ్గ సంగీతం సరిగ్గా.. సరిపడా.. పడాల్సిందే. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ ది అందె వేసిన చేయి అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. వందల చిత్రాలకు మ్యూజిక్ అందించినా ఎక్కడ కాపీ అనే పేరు వినపడకుండా మిగిలిన సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలుస్తూ కెరియర్ గ్రాఫ్ ను పెంచుకున్నారు. 'దేవి' సినిమాతో మొదలైన ఇతడి కెరియర్ ప్రారంభంలోనే అదుర్స్ అనిపించుకుంది. 'ఆనందం' సినిమాతో ఇక జోరు మరింత పెరిగింది. ఈ మధ్య కాస్త డౌన్ అయినా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి స్పీడ్ పెంచారు దేవి.

ఇపుడు డిఎస్పి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఈయన 12వ తరగతి చదువుతున్న సమయంలోనే మొదటి సినిమా దేవికి సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం వచ్చింది. అంత చిన్న వయసులో ఇతడు మంచి మ్యూజిక్ అందించడమా...అసాధ్యం అస్సలు రాంగ్ ఛాయిస్ అని చాలామంది అన్నారు. ఈ సినిమా కథ బాగున్నా పాటలు మాత్రం 'గోవిందే' అంటూ విమర్శలు గుప్పించాడు పలువురు. కానీ దేవి సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి తనని చిన్న చూపు చూసిన వారికి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అప్పటి నుండి ప్రతి సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకుంటూ సరికొత్త సంగీతాన్ని అందిస్తూ ప్రేక్షకుల్ని తన మ్యూజిక్ తో మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.

మ్యూజిక్ తో మ్యాజిక్ చేయొచ్చు.... దేవి శ్రీ అంతకు మించి మెస్మరైజ్ చేయగల మల్టీ టాలెంటెడ్ పర్సన్. తెర వెనుక మంచి సంగీతాన్ని సమకూరుస్తూనే మరో వైపు మైక్ పట్టుకొని పాటలు పాడేస్తారు.  ఇతనికి అమ్మమ్మ తాతయ్య ల పేరు కలిసొచ్చేలా దేవి శ్రీ ప్రసాద్ అని నామకరణం చేశారు ఈయన తల్లిదండ్రులు. అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో అడుగు పెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగిన మన రాక్ స్టార్ మును ముందు ఇలాగే మనల్ని తన సంగీతంతో అలరించాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: