ఇటీవలే ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం కాస్త అటు తెలుగు చిత్ర పరిశ్రమకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో అటు టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు కేవలం నాలుగు షోలు మాత్రమే అనుమతించాలి అంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షో లు లాంటివి అసలు అనుమతించబోమని అంటూ స్పష్టం చేస్తోంది.



 ఇక అన్ని సినిమాలకు కూడా టికెట్ ధర ఒకే విధంగా ఉండాలి అంటూ ఒక ప్రతిపాదనను తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇటీవలే సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం అటు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇక సీఎం జగన్ నిర్ణయం తో టాలీవుడ్ బడా నిర్మాతలు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్లో పెద్ద గా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.



 ఇటీవల ట్విట్టర్ వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా తన విన్నపాన్ని తెలియజేశారు.. జగన్ ప్రభుత్వం ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అంటూ చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలోనే కాలానుగుణంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా విన్నవించారు చిరంజీవి. దేశం మొత్తం ఒకే టాక్స్ తరహాలోనే సినిమా టికెట్లు కూడా ఒకేలా ఉండేలా చూడాలి అంటూ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.. థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎంతైనా అవసరం ఉంది అంటూ మెగాస్టార్ అన్నారు. టికెట్ ధరల పై జగన్ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. చిరంజీవి రిక్వెస్ట్ పై అటు జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: