టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ థమన్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ది బెస్ట్ మ్యూజిక్ ను అందించి మ్యూజికల్ గా సాంగ్స్ ని సినిమాకి హైలెట్ చేశారు. పలు పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు కూడా అందుకున్నారు. ఒకప్పుడు సినీ ప్రపంచాన్ని తన గానంతో ఏలిన దివంగత గాయకుడు ఘంట సాల మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో చిత్రాలకు బెస్ట్ ఆప్షన్ గా నిలచి వరుసగా సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ కి కాపీ కింగ్ అనే విమర్శలు పలు మార్లు వినిపించాయి.

ఈయన పలు హిట్ పాటలకు అందించిన సంగీతం వేరే చిత్రాల నుండి కాపీ చేయబడినవని అని పలుమార్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ ఆయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్  థమన్ ని ఉద్దేశిస్తూ...మీరు మళ్ళీ కాపీ కొట్టారు సార్...!! అంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవలే ఆయన సంగీతం అందించిన క్రాక్ చిత్రానికి సంబంధించి స్వరపరిచినటువంటి సాంగ్‌ ట్యూన్‌ని కాపీ కొట్టినట్లు నెటిజన్లు ఆరోపించిన విషయం ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా లోని ‘బల్లేగా దొరికావే బంగారం’ అనే  సాంగ్  ట్యూన్‌ని  ‘లాటిన్’ అనే చిత్రం నుంచి థమన్ కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శలు కురిపించారు.

గతంలో నాని హీరోగా తెరకెక్కిన 'వి’ చిత్రం  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో కూడా థమన్ కి ఇటువంటి కాపీ సమస్యే ఎదురయ్యింది. అయితే ఈ విమర్శలు అన్నింటికీ థమన్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా ఎందుకు అన్తస్స టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు కాపీ కొడుతున్నారు అనే విషయం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయినప్పటికీ థమన్ కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా తన పనేదో తాను చేసుకుంటూ వెళుతున్నాడు. అందుకే టాలీవుడ్ లో నంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: