తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ఎందరినో అలరించిన సంగీత దర్శకులలో యువన్ శంకర్ రాజా ఒకరు. ఈయన 1979 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్రాసులో జన్మించాడు. ఈయన ప్రముఖ సంగీత దర్శకులైన ఇళయరాజా మరియు జీవ  గారి రెండవ కుమారుడు. దర్శకుడు టీ. నాగరాజన్ మరియు శరత్ కుమార్ కాంబినేషన్ లో 1996 లో విడుదలైన అరవిందన్ అనే సినిమా ద్వారా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. దర్శకుడు కస్తూరి రాజా, హీరో ధనుష్ కాంబినేషన్లో 2000 సంవత్సరంలో విడుదలైన తుల్లువదోల్లమై  అనే చిత్రం యువన్ శంకర్ రాజాకు మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తర్వాత యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడుగా, దర్శకుడు సెల్వరాఘవన్ వీరిద్దరి కాంబినేషన్లో 2004లో తమిళం,తెలుగులో విడుదలైన 7/G బృందావనం కాలనీ  సినిమాతో యువన్ శంకర్ రాజా తమిళ్ తెలుగులోనూ బాగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా  అవార్డు కూడా వచ్చింది.

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా తొలి చిత్రం తీసినప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. సంగీత దర్శకుడిగా జీవితం ప్రారంభించిన 15 సంవత్సరాలలో 100  సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. యువన్ శంకర్ రాజా గారు తన కెరియర్ లో రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్, 5 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, 4 విజయ అవార్డ్స్ మరియు  తమిళనాడు ఫిలిం ఫేర్ అవార్డు కూడా సాధించారు.


యువన్ శంకర్ రాజా గారు 2005 వ సంవత్సరంలో సంవత్సరంలో సుజయ చంద్రన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తను 2002వ సంవత్సరంలో లండన్లో ఒక మ్యూజిక్ ఫంక్షన్ లో కలిశారు. సుజయ లండన్ బేస్ సింగర్ . 2008 లో వీరు డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 2011 సెప్టెంబర్ 1న శిల్పా అనే ఆమెతో వివాహం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: