ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు కరోనా ఇంకో వైపు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం మరొకవైపు రోజురోజుకు ఓటిటీ కి ఆదరణ పెరగడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక ఆపద సినిమా పరిశ్రమకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా థియేటర్ల వ్యవహారాలను టికెట్ వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారుతుంది.

బయట ఎన్ని ధరలు పెరిగినా కూడా పట్టించుకోని ప్రభుత్వం కేవలం సినిమా టికెట్ ధరలు మాత్రం తగ్గించి ప్రజలకు మంచి చేస్తున్నామన్న పేరుతో సినిమా వారిని నట్టేట ముంచుతుందని కొంతమంది అభ్యంతరాలు తెలపగా ఎంతో మంది సినిమా వారు మంతనాలు జరిపినా జగన్ కు రిక్వెస్ట్ లు పెట్టినా ఆయన మనసు మాత్రం కరగడం లేదు. దీనివల్ల సినిమా పరిశ్రమ కష్టపడుతుంది భారీ నష్టం వస్తుంది అని ఎంతమంది చెప్పినా కూడా జగన్ ఈ విషయంలో తన మనసు మాత్రం మార్చుకోలేక పోతున్నాడు. 

అయితే ఇది ఆంధ్రప్రదేశ్ వరకైతే ఫర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ ముగింపు దశకు వచ్చిందని చెప్పాలి అని కొంతమంది చర్చ జరుపుకుంటున్నారు. నిన్న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వగా ఒక్కసారిగా రాష్ట్ర మొత్తం ఉలిక్కి పడింది. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడు తెలుగు సినిమా చరిత్ర లో ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సంస్కరణ ఇతర రాష్ట్రాలకు తాకితే అక్కడ ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడాలి. కేసీఆర్ జగన్ లా ఆలోచించక పోయినా ఎప్పుడో ఒకప్పుడు తాను కూడా ఇలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేయకుండా ఉండడు అనే భయం ఇప్పుడు సినిమా వారిలో నెలకొంది. మరి ఈ విపత్కర పరిస్థితి నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఎలా బయటపడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: