పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ సినిమాల విషయం లో అయినా రెమ్యునరేషన్ విషయంలో అయినా క్రేజ్ విషయంలో అయినా పాపులారిటీ విషయంలో అయినా ఏ హీరో కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఆఖరికి బాలీవుడ్ హీరోల స్థాయిని కూడా మించి దేశంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచిపోయాడు. ప్రస్తుతం ఆయన సినిమాల విషయానికి వస్తే ఏకంగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు.

వాటిలో ముందుగా ఆది పురుష్, సలార్ సినిమాలు విడుదల కాబోతు ఉండగా 2023 వ సంవత్సరం లో స్పిరిట్ మరియు ప్రాజెక్ట్  కేచిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నాడు.  ఇక సంక్రాంతి కానుకగా ఆయన హీరోగా చేసిన రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 14వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించపోతుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 ఈ నేపథ్యంలో ప్రభాస్ వెండితెరపై కనిపించి మూడు సంవత్సరాలు దాటుతున్నా నేపథ్యం లో ఈ సినిమా తో ప్రేక్షకులను మరొకసారి మైమరిపించాలి అని ఆయన డిసైడయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ దేశంలోని ఏ హీరో కూడా తీసుకోవడం లేదనే చెప్పాలి. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరో అయిన తరువాత ప్రభాస్ 100 కోట్ల రెమ్యూరేషన్ తీసుకునే హీరో గా ఎదిగాడు. బాలీవుడ్ హీరోలు సైతం ఈ విషయం లో చిన్న బోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తం గా అన్ని భాషల లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ఈ స్థాయికి ఎదగడం ఆయన అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుంది. ఇక అయన ఒక్కో సినిమా కు తీసుకునే రెమ్యునరేష న్ చూస్తుంటే అందరి హీరోలకు చుక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: