నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమా కు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా , ఆ6ఘోర గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు రాగ అఖండ సినిమా మూడవది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్, ట్రైలర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల  నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను కూడా పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో ఫుల్ అంచనాలకు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

ఇప్పటి వరకు కారోనా సెకండ్ వెవ్ తర్వాత చాలా భారీ మొత్తం లో విడుదలవుతున్న సినిమా ఇదే, ఈ సినిమా కనుక హిట్ టాక్ సంపాదించుకుంటే ఎలాంటి కలెక్షన్ లను తెచ్చుకుంటుందో.? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో లో కలెక్షన్ లను రాబడుతోంది  అని ఎంతో మంది అభిమానులతో పాటు సినీ పెద్దలు కూడా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకొని ఎలాంటి కలెక్షన్ ఎంత తీసుకుంటుందో అంచనా వేయగలిగితే, మిగతా సినిమాల గురించి కూడా అంచనా వేయవచ్చు అని వారి అభిప్రాయం. మరి అఖండ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో... ఎలాంటి కలెక్షన్ లను  బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: