కొంతకాలం క్రితం వరస హిట్స్ తో దూసుకుపోయిన రాజ్ తరుణ్ ఇప్పుడు ఫ్లాప్ హీరోగా ముద్ర పడటంతో అతడిని ఇండస్ట్రీ వర్గాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అతడి సినిమాలు ఎప్పుడు వచ్చాయో మరెప్పుడు వెళ్ళిపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితి.


ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ హీరో నటించిన ‘అనుభవించు రాజా’ మూవీ రేపు విడుదల కాబోతోంది. ఈ మూవీ రాజ్ తరుణ్ కు హీరోగా లిఫ్ట్ ఇచ్చిన అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించింది. గతంలో ఇదే నిర్మాణ సంస్థ నిర్మాణంలో వచ్చిన ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో రాజ్ తరుణ్ హీరో కెరియర్ ప్రారంభం అయింది.


ఇప్పుడు మళ్ళీ పరాజయాల బాటలో ఉన్న రాజ్ తరుణ్ కు బాసటగా నిలవడానికి అదే అన్నపూర్ణా స్టూడియోస్ ఈ మూవీని నిర్మించింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కనీసం ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడ నిర్వహించలేదు. అదేవిధంగా మీడియాలో రాజ్ తరుణ్ తో ఇంటర్వ్యూలు ఇప్పించడం కానీ కనీసం ఈ మూవీని పబ్లిసిటీ చేస్తూ ప్రకటనలు ఇవ్వడం కానీ చేయలేదు. దీనితో సినిమాని ప్రమోట్ చేయడంలో చాల పేరున్న నాగార్జున ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఈమూవీ ఫెయిల్ అవుతుందని ముందుగానే నాగార్జున ఒక నిర్ణయానికి వచ్చేసాడా అంటూ జోక్స్ కూడ వేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితులలో చిన్న సినిమాలకు కూడ భారీ పబ్లిసిటీ చేయవలసిన పరిస్థితి. అలా చేయకుంటే ఆ సినిమాలకు కనీసపు కలక్షన్స్ కూడ రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కెరియర్ పరంగా రాజ్ తరుణ్ కు ఎందుకు ఇలాంటి ఎదురీత ఎదురౌతోంది అంటూ చాలామంది సానుభూతి చూపెడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా కూడ ఫ్లాప్ అయితే ఇక రాజ్ తరుణ్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పడుతుందనే అనుకోవాలి. మంచి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినప్పటికీ ఈ యంగ్ హీరోకు ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి..



మరింత సమాచారం తెలుసుకోండి: