ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతుంది బిగ్ బాస్ షో. అయితే ప్రస్తుతం కేవలం ఒక్క భాషలో మాత్రమే కాదు అన్ని భాషలలో కూడా ఈ కార్యక్రమం ఎంతగానో విజయవంతం అవుతుంది అని చెప్పాలి. బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ కార్యక్రమం. అయితే మొదట హిందీ భాషలో సక్సెస్ అయ్యింది ఈ కాంట్రవర్సి రియాలిటీ షో. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా భారీ రేంజ్ లోనే క్రేజ్ సంపాదించింది.. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఇక బిగ్ బాస్ ప్రారంభిస్తే సక్సెస్ అవుతుందా లేదా అని ఒక ప్రయోగం నిర్వహించగా సూపర్ సక్సెస్ సాధించింది.


 మొదటి బిగ్బాస్ షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం తో ఇక ఈ షోపై ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి. బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది.. అంతేకాదు ఇక మనకు తెలియని సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకునేందుకు బిగ్బాస్ హౌస్ పై ఒక కన్ను వేశారు అందరూ.. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 5వ సీజన్ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఎనభై రోజులు పూర్తి చేసుకుంది.. అయితే ఇక టాప్ ఫైవ్ లో ఎవరు నిలవబోతున్నారో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గత వారం ఎవరూ ఊహించని విధంగా యాని మాస్టర్ ఎలిమినేట్ అయింది అన్న విషయం తెలిసిందే.



 అనీ మాస్టర్ కు బదులుగా ప్రియాంక గాని లేదా కాజల్ గాని ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనీ ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అని మాస్టారు ఎంత సంపాదించారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రతి రోజూ కూడా అనీ మాస్టర్ 50,000 రెమ్యునరేషన్ పొందారట. ఇలా వారానికి 3.5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారట అనీ. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 20 వరకు హౌస్లో కొనసాగిన అనీ మాస్టర్ మొత్తంగా 40 లక్షల రూపాయలను బిగ్ బాస్ హౌస్ లో ఉండి పారితోషికంగా పొందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ani