ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రొటీన్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ విభిన్నంగా తెరకెక్కిస్తారు.. కాబట్టి ప్రతి సినిమా కూడా అనూహ్యమైన స్పందన పొందడం గమనార్హం. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ విభాగంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏలూరు లో జన్మించిన శేఖర్ కమ్ముల పెరిగింది .. మాత్రం హైదరాబాదులోనే... చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖర్ కమ్ముల యుఎస్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేయడం జరిగింది.

అయితే ఇండస్ట్రీలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన తర్వాత ఫిలిం స్కూల్లో చేరాడు. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి MFA డిగ్రీను కూడా పొందాడు.
యూఎస్ లోని ఎన్నో చిత్రాలకు పని చేయడం జరిగింది. అయితే మొదటి సారి తను సొంతంగా దర్శకుడిగా .. నటించిన చిత్రం మాత్రం డాలర్ డ్రీమ్స్. 2000 సంవత్సరంలో తెలుగు , ఇంగ్లీష్ భాషల ద్వారా దర్శకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. విమర్శనాత్మక విజయాన్ని సాధించిన ఈ సినిమా ద్వారా ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

అంతేకాదు ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రదర్శించడం గమనార్హం.  2004లో ఆనంద్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. గోదావరి ,హ్యాపీడేస్ ,లీడర్ ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకు దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత 2014లో అనామిక సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన శేఖర్ కమ్ముల , 2017లో ఫిదా సినిమా ద్వారా సాయి పల్లవి ని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఈ సంవత్సరం నాగచైతన్య చేత లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కించి , ఆయన సినీ కెరియర్ లోనే ఇది బెస్ట్ అనిపించుకునేలా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: