ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్.. ఈ పేరు తెలియని వారు ఉంటారా చెప్పండి. ఎంతో మంది అబ్బాయిలకు ఆమె కలల రాకుమారి. అంతేకాదు మన టాలీవుడు లోని స్టార్ హీరోస్ కి కూడా ఆమె అంటే క్రష్ ఉంది. ఈ విషయాని వాళ్లే పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. మరి అలాంటి అందమైన హీరోయిన్ పోలికలతో మరో అమ్మాయి ఉంటే..ఆమె కూడా హీరోయిన్ గా మనముందుకు వస్తే ఆ ఆనందం, ఆ ధ్రిల్. ఆ సంతోషం .. మాటల్లో చెప్పలేం. కానీ అలానే జరిగింది. అచ్చంగా ఐష్ పోలికలతో ఉన్నటువంటీ ఓ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమెను చూసి అందరు జూనియర్ ఐశ్వర్యా రాయ్ వచ్చింది అనుకున్నారు. ఆమె ఎవరో కాదు స్నేహా ఉల్లాల్.

యస్..స్నేహా ఉల్లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు బాలీవుడ్  సినిమాల్లో సందడి చేసి.. అక్కడి నుండి  తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. తెలుగులోకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ  సుందరి..అతి తక్కువ కాలంలోనే మంచి అవకాశాలు అందుకుంది. తద్వారా మంచు మనోజ్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది. కానీ  ఈ సినిమాల ద్వారా అమ్మడి కెరియర్ కు అంత బూస్టప్ దొరకలేదు అనే చెప్పాలి. కాగా గత కొంత కాలంగా స్నేహా ఉల్లాల్ అసలు కనిపించడం  లేదు. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటుంది.

అసలు ఆమె కనిపించకుండాపోవడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే..అసలు విషయం  బయట పడ్డింది. ఆమెకు ఓ భయంకరమైన జబ్బు వచ్చిందట. అందుకే ఆమె సినిమాలు మానేసిందట. ఆ జబ్బు పేరు ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ వ్యాధి బారిన పడి ఆమె ఎంతో నరకం అనుభవించిందట. ఈ వ్యాధి ముదిరిపోవడం వల్ల ఆమె ఎక్కువ  సేపు నిలబడలేదట, ఎక్కువగా పని కూడా చేయలేదట.. దీంతో ఈమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం కోసం ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందట. దీంతో ఆమె మళ్ళీ తిరిగి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారట. తాజాగా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరి చూడాలి ఎలాంటి సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: