ఉప్పెన సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సనా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన , తనకున్న టాలెంట్ గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే. బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడుగా మాత్రమే మనందరికీ సుపరిచితుడు.. కానీ ఈయన మంచి డైలాగ్ రైటర్ కూడా. అంతేకాదు స్క్రీన్ప్లే దర్శకుడి గా కూడా ఒక సినిమాకు పని చేయడం గమనార్హం.
ఇక డైరెక్టర్ గా ఉప్పెన సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మొదటి సారి 2017 లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా కు డైలాగ్ రైటర్ గా,  స్క్రీన్ ప్లే రైటర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టారు. ఈ సినిమా కంటే ముందు 2009లో ఆర్య2 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా  పనిచేసిన బుచ్చిబాబు,  2011లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా కి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇకపోతే 2014లో ఐ యాం దట్ చేంజ్ అని షార్ట్ వీడియో తీసిన ఈయన, తిరిగి 2016 లో నాన్నకు ప్రేమతో అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడమే కాకుండా స్క్రీన్ ప్లే క్రియేటివ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయడం గమనార్హం.

ఇక ఆ తర్వాత 2018లో రంగస్థలం సినిమా కు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు,  స్క్రీన్ ప్లే రైటర్ అలాగే డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఎన్నో సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్క్రీన్ ప్లే  రైటర్ గా,  డైలాగ్ రైటర్ గా పని చేసి అన్ని విభాగాలలో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా ఉప్పెన సినిమాతో స్టోరీ, స్క్రీన్ ప్లే ,డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన ఎన్నో మెళుకువలు నేర్చుకొని సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని కొట్టడం గమనార్హం. ఎప్పటికైనా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని ఆయన చివరి కోరిక అట..

మరింత సమాచారం తెలుసుకోండి: