జబర్దస్త్ టీవీ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ, ఆ తర్వాత అనేక టీవీ షోలలో యాంకర్ గా చేస్తూ చాలామంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇలా బుల్లి తెరపై హవా ను కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ నాగార్జున హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్ గా కళ్యాణ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగార్జున తో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కూడా తన అందచందాలతో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న అన్ని సినిమాలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

 ఇప్పటికే విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా ఆడిపాడిన ఈ ముద్దు గుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమత్త గా కనిపించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. కేవలం ఐటం పాటలకు, మామూలు పాత్రలో మాత్రమే కనబడడం కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ గానూ, మరికొన్ని సినిమాల్లో మెయిన్ పాత్రల్లోనూఅనసూయ నటించి మెప్పించింది. అయితే తాజాగా అనసూయ ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాలో నటిస్తుంది, ఈ సినిమాలో ప్రభుదేవా, రాజీనా కాసండ్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా హీరోయిన్ అయినా రాజీనా కాసండ్ర కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రాజీనా పోస్ట్ చేసిన ఈ ఫోటో లలో ఒక ఫోటో లో ప్రభుదేవా మరియు రాజీనా కనబడుతున్నారు. ఒక ఫోటో లో  కేవలం రెజీనా మాత్రమే కనబడుతుంది. మరొక ఫోటో లో ప్రభుదేవా, రెజీనా, అనసూయ లు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో అనసూయ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: