బ్రహ్మానందం.... ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కామెడీ కె కింగ్ గా ఇండస్ట్రీలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసుకున్న ఏకైక వ్యక్తి ఈయన.  ఆయన సినిమాల్లో నటించడం ఇప్పటి నుండి మొదలు పెట్టింది కాదు దాదాపుగా గత నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్నారు బ్రహ్మానందం. దీనితో ఎన్నో అవార్డులను రికార్డులను సొంతం చేసుకున్నారు. వీటన్నిటితోపాటు గా అంతులేని అభిమానాన్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా గిన్నిస్ బుక్ లోనూ తన పేరును లిఖించుకున్నారు. బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాలు కాదు దాదాపుగా వెయ్యి సినిమాలకి పైగా నటించి హీరోలకంటే ఎక్కువ అభిమానాన్ని పొందుతున్నారు.

 ఇటీవల బ్రహ్మానందం ఓ అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకోవడం జరిగింది. అయితే తాజాగా బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం శతకాన్ని రచించారు. ఈయన రాసిన ఆ పుస్తకాన్ని ఆదివారం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌లో బ్రహ్మానందం మిత్రులు స్వయంగా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మానందం అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలోనే ఒక నటుడి శతకాన్ని రాయడం ఆయనకి ఎంతో గౌరవాన్ని....ఆనందాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత చలన చిత్ర పరిశ్రమలోనే ఒక నటుడి పై 108 పద్యాలతో శతకాన్ని రాయడం ఇదే మొట్టమొదటి సార్ అని ఆయన పేర్కొన్నారు.


 అయితే దేశంలోని ఏ నటుడికి దక్కని గొప్ప గౌరవం ఆయనకు దక్కింది అంటూ రికార్డ్ సృష్టించాడు బ్రహ్మానందం. అయితే ఈయన ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. అంతేకాకుండా అత్తిలిలో లెక్చరర్ గా  కూడా కొన్నాళ్ళు పనిచేశారు బ్రహ్మానందం. ఆ నా పెళ్ళంట సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బ్రహ్మానందం ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు. అయితే బ్రహ్మానందం అప్పట్లో కోట తో అరగుండు వెధవా అని పట్టించుకున్న ఆయన తనకి ప్లస్ పాయింట్ గా మారింది అరగుండు తోనే సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు బ్రహ్మానందం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: