తనకు నచ్చిన విషయాలను తెలియజేస్తూ ప్రేక్షకులను అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్. తాజాగా ఇందులో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియజేశారు. కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ మీకు బాగా ఇష్టం అని అడగగా.. ఎన్టీఆర్ మాట్లాడుతూ తొలిప్రేమ సినిమా అంటే బాగా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు పోటీ ఉండడం మనకు తెలిసిన విషయమే.
అలాంటి పోటీ ఉన్నప్పటికీ కూడా మన హీరోలు స్నేహితులు లాగానే ఉంటారు. ఈ షో లోనే ఎన్టీఆర్ తో కలిసి వీడియో కాల్ కూడా త్వరలో మాట్లాడుతున్నాడని వార్తలు కూడా వినిపించాయి. అందుకోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇటీవలె ఈ షో కు సంబంధించి షూటింగులు కూడా కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళినట్లుగా సమాచారం.ఇక ఎన్టీఆర్ కు తాజాగా నా ఆపరేషన్ కూడా జరిగింది. rrr సినిమాలో నటించిన ఎన్టీఆర్.. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.తాజాగా తన హాలిడేస్ ను పూర్తి చేసుకుని.. భారతదేశానికి తిరిగి వస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.