తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటనా జీవితంలో బాగా స్థిరపడాలని ఎందరో వస్తుంటారు. కొందరు సక్సెస్ అవుతుంటారు. కొందరు ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా మరికొందరు అయితే మొదటగా వచ్చిన సక్సెస్ ను ఎలా వాడుకోవాలో తెలియక మళ్ళీ ఫెయిల్యూర్ బాట పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ లిస్ట్ చూస్తే చాలానే ఉంది. కానీ రీసెంటుగా ఒక యంగ్ హీరో మాత్రం చాలా కాలంగా సరైన హిట్ లేక డేంజర్ జోన్ లో ఉన్నాడు. 'ఉయ్యాల జంపాల' లాంటి హిట్ మూవీతో యువ హీరో రాజ్ తరుణ్ తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మావ' మరియు 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు.

సినిమా తర్వాత సరైన హిట్ లేక టాలీవుడ్ లో ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో సినిమా అనగానే, ప్రేక్షకులు అంతా మంచి కథ ఉంటుంది అనుకుని సంతోష పడ్డారు. కానీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనుభవించు రాజా' చిత్రం అందరి అంచనాలను తల క్రిందులు చేసింది. ఈ రోజు ఉదయం నుండి వస్తున్న రివ్యూస్ అన్నీ నెగిటివ్ గానే ఉన్నాయి. ఆఖరికి హీరో పాత్రను కూడా సరిగా రాసుకోవడంలో డైరెక్టర్ అనుభవలేమి క్లియర్ గా కనబడుతోంది. కథలో లాజిక్ లేకపోవడం సినిమా ఫెయిల్యూర్ కు ప్రధాన కారణంగా వినబడుతోంది.

వరుస ప్లాప్ లు వస్తున్నా రాజ్ తరుణ్ ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. రాజ్ తరుణ్ ఇలాగే ఇంకో రెండు సినిమాల విషయంలో తప్పటడుగు వేస్తే కెరీర్ క్లోజ్ అవుతుంది. ఏదైనా మంచి కథ డైరెక్టర్ దొరకనిదే రాజ్ తరుణ్ హిట్ కొట్టడం అసాధ్యం. మరి తన సినిమా భవిష్యత్తు కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: