యస్.. వాళ్ళే యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన సిరి, షణ్ముఖ్. బయట వీళ్లు ఎలా ఉండేవారో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వీళ్లు మంచి ఫ్రెండ్స్ నే కానీ వీళ్లు బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే జనాలకు అలా అనిపించడంలేదు. అవసరమున్నా లేకున్నా సిరి.. షణ్ముఖ్ మీద మీద పడడం, కౌగిలించుకోవడం బయట ఉన్న అభిమానులకి నచ్చడం లేదు. అంతేనా ఈ మధ్య ఓ సారి లిప్ కిస్ కూడా చేసిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. దీంతో సిరి షణ్ముఖ్ పై బయట బ్యాడ్ టాక్ మొదలైంది. దీంతో హౌస్ లోకి వెళ్లిన సిరి వాళ్ళ అమ్మగారు..షణ్ముఖ్ మొహానే మీరు హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు అంటూ చెప్పేసింది.
దీంతో షణ్ముఖ్ బాధపడినా వాళ్ల అమ్మగారు పాయింట్ ఆఫ్ వ్యువ్ లో అది కరెక్టే అంటూ సిరిని దూరం పెట్టాడు. కానీ సిరి మాత్రం వాళ్ల అమ్మ జాగ్రత్తలు చెప్పి అలా వెళ్లిందో లేదో వెంటనే వచ్చి షణ్ముఖ్ ని మళ్ళి గట్టిగా వాటేసుకుంది. కానీ షన్నూ మాత్రం ఆమెను పట్టుకోలేదు. దీంతో హర్ట్ అయిన సిరి బాత్ రూం లోకి వెళ్లి మళ్లీ ఏడుస్తుంది. ఇక ఈ వ్యవహారం పై సిరికి కాబోయే భర్త స్పందించాడు. 'సిరి వాళ్ళ అమ్మకి కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేనట్లుంది. పాపం వాళ్లు ఏం చేస్తారు. వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది మరి. ఒక తల్లిగా సిరి తల్లి తన కూతుర్ని బయట తప్పుగా అంటుంటే చూసి తీసుకోలేక అలా అనేసిన్నట్లున్నారు. అసలు ఆమె అలా అంటారని నేను కూడా ఊహించలేదు. ఈ మాటల వల్ల సిరిని తప్పుగా అనుకోకండి. దయచేసి ఆమెపై కోపం పెంచుకోవద్దు. ఆమె తరపున నేను మీమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. ఇక సిరి, షణ్నూల విషయానికి వస్తే వాళ్ల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను' అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.