టాలీవుడ్ లో నంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్నారు దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి. డైరెక్షన్ లో ఆయన రూటే సెపరేటు ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఒకే ఒక్క చిత్రం తో ఇండస్ట్రీ లోకి కెరటంలా దూసుకొచ్చిన ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఏ విజయం కూడా అంత సులువుగా అందదు. దాని వెనుక కనిపించని కృషి ఎంతో దాగి ఉంటుంది. అలా దృడ సంకల్పంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కృషితో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు ప్రతిష్టాత్మక దర్శకులు ఎస్. ఎస్ రాజమౌళి. టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా శిక్షణ పొందారు.

రాజమౌళి హార్డ్ వర్క్ ను గమనించిన డైరెక్టర్ రాఘవేంద్ర ఆయనను బాగా ఎంకరేజ్ చేశారు. అలా కొంతకాలానికి రాఘవేంద్రునికి ప్రియ శిష్యుడిగా మారి మన్ననలు పొందారు. తొలుత ఓ సీరియల్ కి దర్శకుడిగా పనిచేయని రాజమౌళికి చెప్పారు దర్శకుడు రాఘవేంద్రరావు. సినిమాలు చేయాలనే కసితో ఉన్న జక్కన్నకు ఆ ఆఫర్ చేదుగా అనిపించింది, కానీ గురువు మాట కాదనలేక ఒప్పుకున్నారు. ఆ సీరియల్ ఈటివిలో ప్రసారమయ్యేది.  అనంతరం జూనియర్ ఎన్ టి ఆర్ తో సినిమా తీసే అవకాశం అందించారు రాఘవేంద్రరావు. తొలుత ఈ సినిమా షూటింగ్ సమయంలో బొద్దుగా, చామనచాయ రంగులో ఉన్న ఎన్టీఆర్ ను కలిసిన రాజమౌళి మంచి హ్యాండ్ సమ్ హీరోతో సినిమా తీయాలి అనుకుంటే ఇదేంటి ఇలా అయ్యింది యాని ఫీల్ అయ్యారట.

కానీ వన్స్ షూటింగ్ మొదలయ్యాక ఎన్టీఆర్ జోరు, స్టైల్, యాక్టింగ్, నిబద్దత చూసి షాక్ అయిపోయారట రాజమౌళి. అలా రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమాను రిలీజ్ చేస్తే....వచ్చిన రెస్పాన్స్ కి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. కోటి ఎనభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం.. 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అటు దర్శకుడిగా రాజమౌళికి, ఇటు హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ని కీలక మలుపు తిప్పింది. వారి సినీ జర్నీలో ఈ చిత్రం ఒక మైలు రాయనే  చెప్పాలి. దీనిని బట్టి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు కూడా ఆర్టిస్ట్ లను తక్కువ అంచనా వేస్తాడని ఈ సినిమా తర్వాతే అర్ధమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: