డైరెక్షన్ అంటే మేల్స్ మాత్రమే కాదు ఫిమేల్స్ కూడా మెగా ఫోన్ పట్టుకుని చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించగలరు అని నిరూపించారు ఎందరో మహిళా దర్శకులు. వారి చిత్రాలతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గొప్ప గుర్తింపును కూడా పొందారు. అలా చాలామంది లేడీ డైరెక్టర్స్ ఇండస్ట్రీలోకి వచ్చి తొలి సినిమాతోనే తమ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇపుడు అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

* అప్పట్లో విజయ నిర్మల, భానుమతి, బి జయ వంటి వారు లేడీ డైరెక్టర్స్ గా తమ సత్తా చాటారు.

* నందిని రెడ్డి తెలుగులో స్టార్ లేడీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 'అలా మొదలైంది' సినిమాతో కెరియర్ ని స్టార్ట్ చేశారు. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ సక్సెస్ ను సొంతం చేసుకొని సత్తా చాటారు. ఈ చిత్రం హీరో నానికి కూడా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను చిత్రీకరించారు దర్శకురాలు నందిని.

* డైరెక్టర్ సుధా కొంగర చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈమె సినిమా చేసిందంటే పక్కా హిట్ అన్నమాట.
 
* రీసెంటుగా వరుడు కావలెను సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు లక్ష్మీ సౌజన్య. తన మొదటి సినిమాతోనే హిట్ ను అందుకుని గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో నాగ శౌర్య రీతువర్మ హీరో హీరోయిన్లుగా చేసిన విషయం తెలిసిందే. ఈమె తొలుత కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్ళు పనిచేశారు.

* శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్ళిసందD సినిమా హిట్ టాక్ ను అందుకుంది. ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు గౌరీ రోనంకి. డైరెక్ట్ చేసిన తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నారు ఈ లేడీ డైరెక్టర్. ఈమె టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద పదేళ్లపాటు శిష్యరికం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: