టాలీవుడ్ లో బడా హీరోల గురించే అందరూ చర్చించుకుంటారు. ఇక టాప్ హీరోల లిస్ట్ చూస్తే అటు మెగా ఫ్యామిలీ ఇటు నందమూరి మరో వైపు అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి వారిల నుంచి జాబితా చాలానే ఉంటుంది. వీరంతా టాలీవుడ్ లో తమ సత్తా చూపిస్తూ తర‌తరాలుగా ఏలుతున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో నందమూరి, మెగా ఫ్యామిలీస్ మధ్య ఎపుడూ అందమైన పోటీ ఉంటుంది. అటు బాలయ్య ఇటు చిరంజీవి ఇద్దరూ బరిలో నిలిచి బస్తీ మే సవాల్ అంటూ పోటీగా తెచ్చిన సినిమాలు ఎన్నో ఉంటాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ అయితే పోటా పోటీగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇపుడు చిత్రం మారుతోంది. అటు తారక్ హీరోగా ఎంటర్ అయ్యాక మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. ఆయన మెగా వారసుడు రామ్ చరణ్ తో జత కట్టి చేసిన మూవీ ట్రిపుల్ ఆర్ కొత్త ఏడాది జనవరి 7న రిలీజ్ కి రెడీగా ఉంది. సినిమా పరంగానే కాదు, ఇపుడు తారక్ చరణ్ అన్నదమ్ములు మాదిరిగా ఒక్కటిగా కలసి మెలసి తిరిగుతున్నారు.

దాంతో మెగా నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ ముచ్చటను చూసి సంతోషపడుతున్నారు. అదే టైమ్ లో నందమూరి సీనియర్ హీరో బాలక్రిష్ణ అల్లు అరవింద్ తో దోస్తీ చేస్తున్నారు. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద అన్ స్టాపబుల్ పేరిట ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాదు అఖండ మూవీ ప్రీ రిలీజ్ కి అల్లు వారి అబ్బాయి. ఐకాన్ స్టార్ బన్నీ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు. సో ఈ కాంబో చూడ చక్కగా ఉండబోతోంది. అంటే అటు తారక్ మెగానుబంధం తో కొత్త లుక్ ఇస్తూంటే ఇటు బాబాయ్ బాలయ్య కూడా అల్లు వారి నేస్తంగా సరికొత్త బంధాన్ని ముందుకు తెస్తున్నాడు. సో బాబాయ్ అబ్బాయ్ ఇలా టాలీవుడ్ లో ఇలా దూసుకుపోవడం చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ సూపరే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: