తమిళ బిగ్ బాస్ షో కు హోస్ట్ మారనున్నారు,ఈ విషయం గత కొన్ని రోజు లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త మరి ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ప్రధాన కారణం తమిళ బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం కూడా కమల్ హాసన్ కరోనా కు వైద్యం చేసుకుంటున్నాడు, అయితే ఇలాంటి సందర్భం లో తమిళ బిగ్ బాస్ షో కు హోస్ట్ మారే పరిస్థితి కచ్చితంగా వచ్చింది. అయితే అలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షో కు హోస్ట్ గా  కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ రాబోతుంది అని అనేక వార్తలు వచ్చాయి, అయితే తాజా గా తమిళ బిగ్ బాస్ షో కు శృతి హాసన్ హోస్ట్ గా వ్యవహ రించడం లేదు అని తెలుస్తుంది.

 అయితే ఈ శని, ఆది వారాల్లో టెలికాస్ట్ కాబోయే తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ గా సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. మరి రమ్యకృష్ణ హోస్ట్ గా ఏ విధం గా వ్యవహ రిస్తోందా అనే టెన్షన్ ఎవరు పడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే నాగర్జున ఒక సందర్భం లో తెలుగు బిగ్ బాస్ కు షో కు హాజరు కాలేని పరిస్థితు ల్లో రమ్యకృష్ణ తెలుగు బిగ్ బాస్ దౌ కు హోస్ట్ గా వ్యవహరించింది. తెలుగు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వచ్చిన రామకృష్ణ ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. అయితే తాజా గా తమిళ బిగ్ బాస్ షో తో  కూడా అదే అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిం చడానికి రామకృష్ణ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: