టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా సమంత కొన్ని సంవత్సరాలు ఉంది. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత పెళ్లి తర్వాత సినిమాలకు కొత్త వరకు దూరం అయ్యిందని చెప్పాలి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఆమె కేవలం లేడీ ఓరియంటెడ్ మరియు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది. వెబ్ సిరీస్ ను కూడా చేయడం మొదలు పెట్టి సమంత తన కెరీర్ను ముందుకు దూసుకు పోయేలా చేసింది.

అయితే అనూహ్యంగా ఆమె జీవితంలో కీలక పరిణామం జరిగింది. అదే ఆమె ఎంతగానో ప్రేమించిన భర్త నాగ చైతన్య తో విడాకులు జరగడం. ఆమె అభిమానులను ఈ విషయం ఎంతగానో నిరాశ పడేలా చేసింది. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ కపుల్ గా ఉన్న వీరు ఇలా విడిపోవడం పట్ల ఎన్నో రకాల చర్చలు జరగగా వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయి ఇతర విషయాలకు వెళ్ళిపోయారు. తాజాగా వీరిద్దరూ ఎవరికి వారు తమ కెరీర్ ను స్పీడ్ చేసుకునే పనిలో పడ్డారు. 

ఈ నేపథ్యంలోనే సమంత ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వార్తలు రావడం ఇప్పుడు అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జాన్ ఫిలిప్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది తొలి ఇంటర్నేషనల్ మూవీ కాగా ఈ చిత్రంలో ఆమె బై సెక్సువల్ తమిళ అమ్మాయి గా నటించబోతోంది. మరి పెళ్లి తర్వాత ఆమె ఎలాంటి సినిమాతో రాబోతుంది అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. పురుషులతోపాటు అమ్మాయిలకు ఆకర్షించ బడే సమంత ఈ పాత్ర లో ఎలా నటించబోతుంది అనేది చూడాలి. ఇప్పటి వరకు ఆమె కొన్ని సినిమాలలో మాత్రమే బోల్డ్ పాత్రలలో చేయగా ఈ బోల్డ్ పాత్ర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: