కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో రాజశేఖర్. ఆ తర్వాత ట్రెండ్ కి తగ్గ సినిమాలు చేయలేక వెనుకబడి పోయాడు. ఆయనతో పాటు సినిమా పరిశ్రమలోకి వచ్చిన తోటి సీనియర్ హీరోలు ఇప్పుడు అదే స్టార్డం ను కొనసాగిస్తూ ఉండగా మధ్యలో కొన్ని తప్పు సినిమాల ఎంపిక వలన రాజశేఖర్ కనుమరుగయ్యే స్థాయికి చేరుకున్నాడు. కానీ ఈ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా గరుడవేగ అనే సినిమా చేశాడు.

రాజశేఖర్ కు దాదాపుగా పూర్వ వైభవం వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే ఇంత పెద్ద భారీ విజయం అందుకున్న రాజశేఖర్ ఆ విజయాన్ని ఎక్కువ సేపు నిలుపుకోలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ పాత పంథాలోనే వెళ్లి కల్కి అనే సినిమా చేశాడు. ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ కమర్షియల్ గా ఎవరికీ కూడా పెద్దగా ఎక్కలేదు. రాజశేఖర్ కు మరొక భారీ ఫ్లాప్  రావడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండి పోయినట్లు అయింది. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని మరీ రాజశేఖర్ శేఖర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినట్లు వార్తలు రాగా ఇప్పుడు కొంత బ్యాలెన్స్ షూట్ ఉందని తెలుస్తుంది. మలయాళం సినిమా జోసెఫ్ కు రీమేక్ గా ఈ సినిమా చేస్తుండగా రాజశేఖర్సినిమా పై మంచి నమ్మకం పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రానికి డైరెక్టర్ పేరును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా దర్శకుడు పేరు లలిత అని కాకుండా జీవిత-రాజశేఖర్ అని ఉంది. దాంతో ఆమెను ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఇదే విధంగా ఒక డైరెక్టర్ తో మొదలుపెట్టి మధ్యలో జీవిత ఆ సినిమాలను తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో దర్శకుడునీ ఎందుకు పక్కనపెట్టారు అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: