టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఎక్కడైనా ఏ సినిమా పరిశ్రమలో అయినా ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. ఐడియా రూపంలో ఉన్న ఒక సినిమా చిత్రంగా మార్చి దానిని ప్రేక్షకులు మెచ్చే విధంగా చేయాలంటే చిత్ర యూనిట్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని రోజుల శ్రమ కొంత మంది కష్టం నిర్మాత సంపాదన కలగలిపి ఆ చిత్రం హిట్ అవ్వాలంటే ఒకరిని మెప్పించాలంటే అది చిన్న విషయం కాదు. కానీ తన సినిమాల విషయంలో ఇది చాలా ఈజీ అని నిరూపించుకున్నాడు వెంకటేష్.

చేసేది రీమేక్ సినిమా ఆయన డబ్బింగ్ సినిమా ఆయన ఒరిజినల్ కథ ఉన్న సినిమా అయినా కూడా ఆయన అవలీలగా హిట్స్ సాధిస్తూ తన కెరీర్ను మరింత ముందుకు వెళ్ళిలా చేసుకుంటున్నాడు. టాలీవుడ్ పరిశ్రమలో అందరి హీరోల కంటే ఎక్కువ గా రీమేక్ సినిమాలు చేసింది ఒక వెంకటేష్ అనే చెప్పాలి.  ఆ తర్వాతనే మిగతా హీరోలు ఉంటారు. అయితే ఏదో ఒక సినిమా వద్ద ఇతర హీరోలు బోల్తా పడుతూ ఉంటారు కానీ వెంకటేష్ మాత్రం సినిమా చేసే ముందే అన్ని ఆలోచించుకుని రంగంలో దిగి ఆ సినిమా హిట్ అయ్యే వరకు నిద్రపోడు. 

ఆ విధంగా ఇటీవలే ఆయన వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తూ వాటిని సూపర్ హిట్ చేసుకుంటున్నాడు. నారప్ప సినిమాను విడుదల చేసి సూపర్ హిట్ సాధించిన కొన్ని నెలల సమయం లోనే వెంకటేష్ ఇప్పుడు తన తదుపరి సినిమా దృశ్యం2 కూడా విడుదల చేసి దాన్ని సూపర్ హిట్ గా మార్చాడు. చాలా సింపుల్ గా సినిమాలతో హిట్ సాధిస్తూ దూసుకెళ్తున్నడు. ఇతర హీరోలు చాలా కష్టపడుతూ ఉండడం తో వెంకీ అభిమానులు ఈ విషయంలో ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక మరోవైపు ఎఫ్ 3 అన్ ఒరిజినల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేసిన వెంకటేష్ వచ్చే ఏడాది ఎన్ని సినిమాలు చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: