తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలు విడుదలై చాలా రోజులు అవుతుందని తెలుస్తుంది.దానికి కారణం కరోనా వైరస్ అని అందరికి తెలుసు.దీని ప్రభావం గత రెండేళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలపైనా పడిందని తెలుస్తుంది.

వైరస్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సినిమాలను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారట కొంత మంది దర్శక నిర్మాతలు. కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలను నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. రెండు రోజుల కింద కూడా వెంకటేశ్‌ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైందని తెలుస్తుంది.. దానికి ముందు నాని హీరోగా నటించిన టక్ జగదీశ్‌ కూడా ఇలాగే వచ్చిందని తెలుస్తుంది.. ఈ పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ పూర్తిగా బయట పడటానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోందట.అందుకే భారీ సినిమాలు ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలుస్తుంది

తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అంచనాలున్న సినిమా ఏది రాలేదని తెలుస్తుంది. ఒకవేళ ధైర్యం చేసి విడుదల చేసినా కూడా కలెక్షన్స్ వస్తాయా రావా అనే డైలమాలో ఉన్నారట నిర్మాతలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ సినిమాలు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చిన కూడా 35 కోట్లు దాటలేదని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలకు ఇలాంటి కలెక్షన్స్ అస్సలు సరిపోవని సమాచారం. పెద్ద సినిమాల కోసం మొహం వాచిపోయిన వేచి చూస్తున్న ప్రేక్షకులకు దాదాపు 8 నెలల తర్వాత అఖండ సినిమా విందు భోజనంలా కనిపిస్తుందని తెలుస్తుంది.

 
బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.. దీనిపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలుస్తుంది.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇదని అందరికి తెలుసు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా వేచి చూస్తుందట  దీనికి వచ్చే కలెక్షన్స్ బట్టి రాబోయే సినిమాల భవిష్యత్తు డిసైడ్ కానుందని తెలుస్తుంది. పైగా ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ మొదలైందని సమాచారం. ఇంతకు ముందులా బెనిఫిట్ షోస్ లేవని అన్నింటికి మించి అధిక టికెట్ ధరలు ఉండవని తెలుస్తుంది.ఇవన్నీ బేరీజు వేసుకొని వచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని ఆసక్తిగా గమనిస్తున్నారట ట్రేడ్ పండితులు. అందుకే అఖండ సినిమా తెలుగు సినిమాకు ఒక టెస్టింగ్ మూవీగా మారిపోయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: