దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్ ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్, సముద్ర కని, ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించ నుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు, అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా పనులు దాదాపు ముగియడంతో చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ సినిమాను సెన్సార్ చేసినట్లు సోషల్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దాదాపు సినిమా విడుదలకు వారం పది రోజుల ముందు  సినిమాను సెన్సార్ చేస్తూ ఉంటారు.  కానీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ఇంకా దాదాపు నెల సమయం కంటే ఎక్కువ ఉంది, ఇంత ముందుగా సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడం వల్ల ప్రమోషన్ ల కోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందువలన ముందుగానే ఈ సినిమా సెన్సార్ ను చిత్ర బృందం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ లో యుద్ధ సన్నివేశాలు ఉండటం వల్ల సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే సినిమా రన్ టైం మూడు గంటల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు గంటల సినిమా అనే ఒక వార్త సోషల్ మీడియాలో బయటికి రాగానే రాజమౌళి ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకేకించి ఉంటాడా సినిమాను ఎప్పుడు థియేటర్ లో చూస్తామా అని జనాలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: