ప్రస్తుత పరిస్ధితులు ఒక్కప్పుడిలా లేవు.. కాలం మారే కొద్ది జీవన విధానంలోను మార్పులు వస్తున్నాయి. ఒక్కప్పుడు పెళ్లిలకు ఇప్పుడు పెళ్ళిలకు తేడా చూస్తే ఈ విషయం మనకు క్లీయర్ గా అర్ధమౌతుంది. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిలు సర్వ సాధారణం అయిపోయాయి. అందులోను సినీ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. 100శాతం లో 95 శాతం ప్రేమ పెళ్లిలే చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇలా ఒక్కే సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన అమ్మాయి అబ్బాయిలు పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారడం చూసాం. డైరెక్టర్లని పెళ్ళాడిన హీరోయిన్ ల గురించి కూడా విన్నాం. కానీ సీనీ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు మాత్రం ఐటెం సాంగ్స్ చేసిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

యాక్టర్ శ్రీహరి..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలో హీరోగా, లీడ్ రోల్స్, విలన్ గా చేసిన శ్రీహరి కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ కి అందరు అట్రాక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శ్రీహరి ఆరోగ్య కారణాల చేత మరణించారు. ఇక ఈయన భార్య మనకు బాగా సుపరిచితురాలే. డిస్కో శాంతి. ఈమె డ్యాన్స్ స్టెప్స్ కి ఎవ్వరైన క్లాప్స్ కొట్టాల్సిందే. స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి డ్యాన్స్ వేయడంలో ఈమె తరువాతే ఎవ్వరైనా. ఇక శ్రీహరి..డిస్కో శాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇకపోతే జే డీ చక్రవర్తి..ఈయన కూడా శ్రీహరి లాగే అనుకృతి అనే ఐటెం సాంగ్స్ చేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అంతేకాదు జేడీ కూడా శ్రీహరి లాగే ఫస్ట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసుకుంటూ..ఆ తరువాత మెల్లగా హీరోగా, సినిమాలో లీడ్ రోల్ క్యారెక్టర్స్ చేసారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి హ్యాపీగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: