ప్రస్తుతం బుల్లితెరపై  బిగ్ బాస్ రియాలిటీ షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది బిగ్బాస్ కార్యక్రమం. అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సినీ ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అవుతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఇక బయటికి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వుంటారు. అయితే  ఇటీవలే తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ గా క్రేజ్ సంపాదించుకున్న మళ్ళీ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వారు ఉన్నారు.



 ఇలా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చు కున్న విశ్వ బిగ్ బాస్ హౌస్ లో చాలా వారాలపాటు కొనసాగాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తనకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటూ బాధపడ్డాడు విశ్వ. నాకు డబ్బులు చాలా అవసరం ఉందని కొడుకు స్కూల్ ఫీజు చెల్లించడానికి బిగ్బాస్ హౌస్ లోకి వచ్చాను అంటూ తన బాధను చెప్పుకున్నాడు. దీంతో ఇక విశ్వ బాధను విన్న ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఓట్లు వేసి మద్దతు తెలిపారు అని చెప్పాలి.



 కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ లో గుర్తింపు సంపాదించుకుని ఇటీవల ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన విశ్వపై మాత్రం అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం విశ్వ బీఎండబ్ల్యూ కారు కొనడమే.. ఇటీవలే బీఎండబ్ల్యూ కార్ కొని ఇక ఇది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విశ్వ. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయని కొడుకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు అంటూ బాధ పడిన విశ్వ ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనడం పై మాత్రం అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అసలు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పిన విశ్వ ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు కొనడానికి డబ్బులు ఎక్కడివి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: