బుల్లితెరపై బిగ్బాస్ షో కి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం. తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో కి భారీ క్రేజ్ ఉంది. ఇక ఈ షో తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందుతూనే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఐదవ సీజన్ కొనసాగుతుండగా అది కూడా మంచి టి ఆర్ పి ల ను దక్కించుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ షో ను కింగ్ నాగార్జున హౌస్ చేస్తున్నారు. మరోవైపు తమిళ బిగ్ బాస్ కి కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక కోలీవుడ్ అగ్ర నటుడు కమలహాసన్ తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు.

 ప్రస్తుతం హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ కి ఎవరు హోస్ట్గా వ్యవహరిస్తున్నారనే అంశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కమల్ హాసన్ అనారోగ్యం బారిన పడడంతో ఆయన మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఆయన కూతురు శృతిహాసన్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నారని మొదట వార్తలు వినిపించాయి.అయితే ప్రస్తుతం శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఆమెకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు మళ్ళీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులకు మంచి ఆప్షన్ కనిపించింది.

 ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్ హోస్ట్ గా ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక గతంలో రమ్యకృష్ణ తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ కి ఓ వీకెండ్ హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగులో మూడవ సీజన్ నడుస్తున్న సమయంలో నాగార్జున తన పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లగా ఆ సమయంలో రమ్య కృష్ణ హోస్ట్గా మారి అందరినీ తన హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టు కున్నారు. దీంతో హోస్టింగ్ లో రమ్యకృష్ణకి అనుభవం ఉండటంతో ఇప్పుడు తమిళ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ వీకెండ్ రమ్యకృష్ణ హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరి తమిళంలో తన హోస్టింగ్ తో రమ్యకృష్ణ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: