సంక్రాంతి బరిలో దిగడానికి స్టార్ హీరోలు ఎంతగా పోటీ పడుతున్నారో, డిసెంబర్‌ ఫ్రైడేస్‌కి అంతే డిమాండ్ ఉంది. ఒక్కో వారం ఒక్కో హీరో బరిలో దిగుతున్నారు. బాలక్రిష్ణ, 'అఖండ' సినిమాతో డిసెంబర్‌ సినిమాల సందడి మొదలవుతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో థర్డ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌2న రిలీజ్ అవుతోంది.

సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామక్రిష్ణ లీడ్‌రోల్స్‌లో వస్తోన్న సినిమా 'స్కైలాబ్'. విశ్వక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 4న రిలీజ్ అవుతోంది. బాలక్రిష్ణ 'అఖండ' రిలీజ్‌ అయిన రెండు రోజుల గ్యాప్‌లోనే 'స్కైలాబ్' సినిమా విడుదలవుతోంది.
నాగశౌర్య చాక్లెట్‌బాయ్‌ లుక్‌ నుంచి బయటకొచ్చి, కంప్లీట్‌ అథ్లెట్‌గా మారిన సినిమా 'లక్ష్య'. సంతోష్‌ దర్శకత్వంలో ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో శౌర్య, ఆర్చర్‌గా నటించాడు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోనే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 10న రిలీజ్ అవుతోంది.

సుకుమార్, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప-1' సినిమా పోస్టర్స్‌తోనే హైప్స్‌ క్రియేట్ చేసుకుంది. స్టైలిష్ స్టార్ బన్ని రగ్గడ్‌లుక్‌లో కనిపించడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు స్టార్ ఎలాంటి మేజిక్స్‌ చేస్తాడో అనే ఆసక్తి కూడా పెరిగిపోయింది. ఈ హైప్స్‌తోనే డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది 'పుష్ప'. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా 'శ్యామ్‌ సింగరాయ్'. రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో నాని, డ్యుయల్‌ రోల్‌ ప్లే చేశాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. పోస్టర్స్‌తో వైవిధ్యంగా కనిపించిన ఈ శ్యామ్‌ సింగరాయ్ డిసెంబర్‌ 24న రిలీజ్ అవుతోంది.

వరుణ్‌ తేజ్‌ మాస్, యాక్షన్స్‌కి కొంచెం దూరంగానే ఉంటాడు. రెగ్యులర్‌ స్టోరీస్‌కి భిన్నంగా ఉండే కథల్లోనే నటిస్తుంటాడు. ఇలాంటి మెగాప్రిన్స్‌ ఫస్ట్‌ టైమ్‌ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ చేశాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమాచేశాడు. ఈ మూవీ కోసం వరుణ్‌ తేజ్‌ విదేశాల్లో బాక్సింగ్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శ్యామ్‌కి పోటీగా డిసెంబర్‌ 24నే రిలీజ్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: