అల్లు అర్జున్ 'పుష్ప'లో కంప్లీట్‌ రగ్గడ్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ లుక్‌తో పాటు బన్ని కటౌట్‌లోనూ మార్పులు చూపిస్తున్నాడు సుకుమార్. పుష్పలో బన్ని షోల్డర్‌ ప్రాబ్లమ్‌తో కనిపించబోతున్నాడు. సుకుమార్ స్టైలిష్‌ మూవీస్‌ మాత్రమే తీస్తాడనే ఇమేజ్‌ని చెరిపేసిన సినిమా 'రంగస్థలం'. కంప్లీట్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ మూవీలో రామ్‌ చరణ్ సర్‌ప్రైజింగ్ రోల్‌ చేశాడు‌. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రతో ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చేశాడు.

అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఫుల్‌ ఆన్ కామెడీతో పాటు హీరోలకి వైకల్యం కూడా కనిపిస్తోంది. 'ఎఫ్-3'  సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌ ఇద్దరూ డిజార్డర్స్‌ ఉన్న పాత్రలు పోషిస్తున్నారు. వెంకీ  రేచీకటి వ్యాధి బాధితుడిగా నటిస్తున్నాడు.అలాగే వరుణ్‌ పాత్రకి నత్తి ఉందట. కానీ 'ఎఫ్-2' సినిమాలో వీళ్లు నార్మల్‌గానే కనిపించారు. సీక్వెల్‌కి వచ్చేసరికి వెంకీ, వరుణ్‌ ఇద్దరికీ లోపాలు పెట్టాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ అంధుడిగా నటించాడు.

 ఈ జనరేషన్‌లో అన్ని రకాల పాత్రలు చేయగలడు అనిపించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. డ్యుయల్‌ రోల్‌ సినిమాలే తగ్గిపోతోన్న సమయంలో తారక్ ట్రిపుల్‌ రోల్‌ చేసిన సినిమా 'జై లవకుశ'. ఇక జూ.ఎన్టీఆర్‌ పోషించిన మూడు పాత్రల్లో 'జై'  క్యారెక్టర్‌కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నత్తితో ఇబ్బందిపడే జై క్యారెక్టర్‌ని తారక్‌ అద్భుతంగా ప్లే చేశాడనే కాంప్లిమెంట్స్‌ వచ్చాయి.

టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నత్తి ఉన్న ఆసి క్యారెక్టర్‌తో నాలని మెప్పించాడు. మారుతికి మొదట్లో బోల్డ్‌ మూవీస్‌ తీస్తాడనే ఇమేజ్ ఉండేది. అలాంటి డైరెక్టర్‌కి ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్‌ తీసుకొచ్చిన సినిమా 'భలే భలే మగాడివోయ్'. ఈ మూవీలో నాని మతిమరుపు క్యారెక్టర్‌ ప్లే చేశాడు. ఇక ఈ సినిమాతోనే నాని నేచురల్‌ స్టార్‌గా అవతరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్‌ కూడా పెంచుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: