స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు ఏ రేంజిలో ఉంటాయో మనందరికీ తెలుసు. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో ఎవరికి ఎప్పుడు ఏ చిన్న ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు సాధారణంగా ఆయన అడిగితే ఎవరు కూడా నో చెప్పడానికి ఇష్టపడరు. అయితే రాజమౌళి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఎంతోమంది జాతకాలు మారిపోయాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా ల డేట్ లు కూడా ఇవ్వలేనంత బిజీ అయిపోయారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాయ శర్మ  బాహుబలి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో వర్గ విభేదాలు ఉంటాయని చాలా మంది అంటారని కానీ అలా ఏమీ ఏమి ఉండదు.

 టాలెంట్ ఉంటేనే ఎవరికైనా నా అవకాశాలు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలో సినిమా అనేది ఒక బిజినెస్ అని దానికి తగ్గ వారిని ఎంపిక చేసుకుంటారని ఆయన వెల్లడించారు. అయితే సుబ్బరాయ శర్మగారు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా 250 సినిమాలకు పైగా చేసినట్లు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో మనది ఎంత గొప్ప క్యారెక్టర్ అయినా సరే సినిమా హిట్ కాకపోతే ఏం లాభం ఉండదని కూడా ఆయన చెప్పారు. అయితే కెరీర్ చాట్ చేసే మొదటి రోజుల్లో మేనేజర్లను పెట్టుకోవాలనే విషయం ఆయనకి తెలియదట. ఇండస్ట్రీలో ఆయనను బాగా ప్రోత్సహించింది  ఎస్వీ కృష్ణారెడ్డి గారు అని తెలిపారు.

 విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో తనకు మంత్రి పాత్ర ఇచ్చారని కానీ తన భార్య ఆరోగ్య పరిస్థితి ఆ సమయంలో బాగా లేకపోవడంతో మూడవ రోజే షూటింగ్ వదిలేసి ఆయన రావడం జరిగిందని చెప్పారు. అయితే గత 42 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నేను ప్రస్తుతం ఏ ఆఫర్లు లేకుండా ఉన్నానని ఆయన తెలిపారు.సీవీఎల్ నరసింహారావు, అశోక్ కుమార్, జెన్నీ అంతా తమ బ్యాచ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రామానాయుడు కి ధర్మ చక్రం అనే ఓ సినిమాలో జరిగిన ఘటన వల్ల సుబ్బరాయ గారి పైన కోపం వచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే ఆయనకి ఆ కోపాన్ని కొద్దిసేపటి వరకు మాత్రమే అని కూడా సుబ్బరాయ శర్మ తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: