రౌడీహీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న బంధం గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు ఎన్నిసార్లు చెప్పినా, నెటిజన్స్‌ మాత్రం ఏదో జరుగుతోందని అని కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రష్మిక అమెరికా టూర్‌ని కూడా లవ్‌యాత్ర అని ట్రోల్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముంబయి రెస్టారెంట్‌లో కలిసి కనిపించారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. రష్మిక చాలా సార్లు మీరు ఊహించుకున్నట్టు..ఏం లేదని చెప్పినా వినడం లేదు. ఆ డేటింగ్‌ మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల రష్మిక మందన్న ఇంటికి దూరంగా వెళ్తున్నానని ఫ్లైట్ టిక్కెట్స్‌ పోస్ట్‌ చేయగానే నెటిజన్ల నుంచి డేటింగ్‌ ముచ్చట్లు మొదలయ్యాయి.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ యుఎస్ షెడ్యూల్‌లో ఉంది. అక్కడ బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్, హీరోయిన్‌ అనన్యాపాండేతో కలిసి షూటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు రష్మిక మందన్న ఫ్లైట్‌ ఎక్కింది కూడా 'లైగర్'ని కలవడానికే అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్ని ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. 'గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకులని పలకరించారు. వీటిల్లో రష్మిక, విజయ్‌ కెమిస్ట్రీకి సెంట్‌ పర్సంట్‌ మార్క్స్‌ పడ్డాయి. దీనికితోడు రష్మిక టాలీవుడ్‌కి వచ్చాక కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. అప్పటినుంచి వీళ్లిద్దరి గురించి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ రష్మిక ఫ్లైట్‌ జర్నీ ఎక్కడికనేది మాత్రం సస్పెన్స్‌ గా మిగిలిపోయింది. చూద్దాం.. ముందు ముందు వీళ్లద్దరి గురించి ఇంకెన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయో. అలాంటిదేం కాదు అని నెత్తినోరు బాదుకుంటున్నా నెటిజన్లు మాత్రం తమ అనుమానాలకు హద్దే లేకుండా పోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: