తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నట శార్వ భౌముడు. కేవలం సినిమాలోనే కాదు..ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి..ముఖ్యమంత్రి అయ్యి తనని నమ్మి గెలిపించిన ప్రజలకు ఎన్నో నూతన పధకాలను అమలు చేసి..ప్రజల మనసుల్లో చిరస్దాయి గా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గురించి మనం ఎంత చెప్పుకున్న అది చూసేవాళ్లకి తక్కువగానే అనిపిస్తుంది. ఇక ఈయన ఖాతాలో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. అయినా కానీ ఆ ఫ్లాప్ అయిన సినిమాలో ఈయన నటనకు మాత్రం మంచి మార్కులు పడడం గమనార్హం.

సాధారణంగా ఒక్క సినిమా షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు..గణపతికి పూజ చేసుకుని..కొబ్బరకాయ కొట్టడం మన సాంప్రదాయం. ఇండస్ట్రీలో ఉండే ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో , హీరోయిన్ లు ఇలానే చేస్తారు. అలా పూజ కంప్లీట్ అయ్యాక..సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్ల పై క్లాప్ కొట్టడానికి పలువురు స్టార్స్ ని పిలిచేవారు. ఇప్పటికి ఈ తంతూ ఇలానే కొనసాగుతుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ నటించించిన ఓ సినిమాకి ఆయన కొడుకు బాలకృష్ణ క్లాప్ కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. పలువురు బడా  స్టార్స్ ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆయన కొడుకు చేత క్లాప్ కొట్టించడం పెద్ద హైలెట్ గా నిలిచింది.

1976 సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన " బంగారు మనిషి" అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పూజ కార్యక్రమాలకి బాలయ్య కూడా వెళ్లాడు. ఇక పూజా పనులు పూర్తి అయ్యాక తన తండ్రి సినిమాకి బాలకృష్ణ క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కి క్లాప్ కొడుతున్న బాలయ్య.. ఫోటోలో చాలా యవ్వనంగా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: