ఒక్క సినిమా తెర పైకి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో నిద్ర లేని రాత్రుల్లు గడపాలి, ఎన్నో అవాంతరాలను ఎదురు కోవాలి అప్పుడే ఆ సినిమా బొమ్మ తెర పై పడుతుంది. ఇక సినిమా హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అయితే , ఇక్కడ ఒక బడా దర్శకుడు మాత్రం తన సినీ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ అయినా పడితే బాగుండూ అని అనుకున్నారట. ఓ ఫ్లాప్ సినిమా నా ఖాతాలో ఇవ్వు దేవుడా అంటూ ఎందరో దేవుళ్లను కోరుకుంటున్నాడట. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరు..? ఎందుకు అలా తన సినిమా ఫ్లాప్ అవ్వాలి అని కోరుకున్నాడో..ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం..!!
అసలు విషయంలోకి వెళితే.. కోదండరామిరెడ్డి.. ఈ దర్శకుడు గుర్తున్నారు కదా.. అయినా ఆయనను మర్చిపోవడం అంత సులువు కాదులేండి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన కోదండరామిరెడ్డి కి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా మంది నటులకు తన సినిమాలో అవకాశం ఇచ్చిన ఈయన డైరెక్షన్ లో చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. బడా హీరోస్ కూడా ఈయనతో కలిసి వర్క్ చేయాలి అని అనుకునేవారు..అంటే ఈయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్ధం చేసుకోండి. ప్రళయ రుద్రుడు, కిరాయి రౌడీలు, అభిలాష , ప్రేమమూర్తులు, చాలెంజ్ ,కిరాయి కోటిగాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఈయన క్రేజ్ చూసి..ఒకానొక సమయంలో ఈయన తో సినిమా చేయాలని బడా నిర్మాతలు ఈయన ఇంటికి క్యూ కట్టడంతో..కోదండరామిరెడ్డి ఏం చేయాలో అర్ధంకాక ఆ దేవుడిని నాకు ఒక్క ఫ్లాప్ సినిమా ఇవ్వు దేవుడా అని కోరుకున్నాడట. ఆయనకు ఒక ఫ్లాప్ సినిమా పడితే అప్పుడైన ఇలా నిర్మాతలు నన్ను విసిగించరు..అప్పుడు నేను ఆకాశంలో కాకుండా నేలపై నడుస్తా అని ఆ భగవంతుడిని వేడుకున్నాడట కోదండరామిరెడ్డి.