సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అన్నా, వచ్చి హిట్ కొట్టాలన్న చాలా కష్టం. మన అదృష్టం బాగుండి అని జరిగినా..ఆ తరువాత ఆ స్ధానాని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అందుకే ఎవరైనా సినిమాలోకి వెళ్తాను అంటే ముందు మనలని వెనక్కి లాగుతారు. ఈ సినిమాలు మనకి కలిసి రావు అంటూ కొంతమంది ఫెయిల్యూర్ పీపుల్ లిస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యంగ్ హీరో నిఖిల్‌ని చూసి నేర్చుకోవాలి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి .. ఇప్పుడు పెద్ద హీరోలకు సైతం కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చినా హ్యాపీడేస్‌ అనే సినిమా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. మొదట్లో అన్నీ మాస్ సినిమాలు చేస్తూ మాస్ జపమే చేశాడు. ఫలితంగా కెరీర్ లో వరుస హ్యట్రిక్ ఫ్లాప్ సినిమాలు పడ్డాయి.

 కానీ మనోడీ యాక్టింగ్ చూసి అందరూ నెక్ట్స్  రవితేజ అంటూ కాంప్లీమెంట్స్ ఇచ్చారు. జనరల్ గా ఎవ్వరైనా కానీ ఒక సారి ఫెయిల్యూర్ వస్తే డీలా పడిపోతారు .. కానీ మనోడు మాత్రం, ఎక్కడ తగ్గకుండా ఫ్లాప్ సినిమాలు పడినా కూడా సినిమాలు చేస్తూ..లాస్ట్ కి మాస్ సైడ్ నుండి క్లాస్ సైడ్ కి వచ్చి కార్తికేయ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. స్వామి రారా లో కూడా నిఖిల్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తరువాత అర్జున్ సురవరం అనే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  ఫ్లాప్ సినిమాలు పడ్డాయాని కుంగిపోకుండా తన కెరీర్ గురించి తాను నిజాయితీగా విశ్లేషించుకున్నాడు అంటూ ప్రముఖులు సైతం నిఖిల్ ని మెచ్చుకున్నారు.

ఇక మనోడి లైఫ్ లో హ్యాపీడేస్ స్టార్ట్ అయ్యాయి అని తెలుస్తుంది.  వరుస విజయాలను అందుకుంటూ నిఖిల్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ హిట్ అంటూ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్  ‘18 పేజెస్’, ‘కార్తికేయ-2’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలూ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా నిఖిల్ "ఆర్ ఆర్ ఆర్" నుండి రిలీజ్ అయిన జనని సాంగ్ చూసి కన్నీళ్లు ఆగడం లేదంటూ  ట్వీట్ చేసాడు.  దేశభక్తిని చాటే విధంగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో ని ఈ జనని పాట ఆయనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. ఇప్పటి వరకు "ఈ జనని సాంగ్‌ను మొత్తం 20సార్లు చూశానని చెప్పిన ఆయన.. చూసిన ప్రతీసారి కూడా కన్నీళ్లు ఆగడం లేదంటూ" తన ట్వీట్ లో పేర్కోన్నాడు. ఈ జనని పాట కోసం కీరవాణి ఏకంగా  రెండు నెలలు శ్రమించారని ఇప్పటికే ఓ ఇంటర్వ్యుల్లో  రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: