కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు మూడు సంవత్సరాలు కష్ట పడి తెరకెక్కించిన చిత్రమే " రణం రౌద్రం రుధిరం". పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రాం చరణ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మొదటి వారంలో గ్రాండ్ గా తెరపైకి రానుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న విడుదలవుతోంది ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ రోజు రోజుకూ ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది.

సినిమాని తెరకెక్కించడంలోనే కాదు ఆ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం లోను రాజమౌళి స్టైల్ వేరేలా ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్నీ పాటలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యం గా "నాటు నాటు" పాట అయితే అదుర్స్ అని అంటున్నారు. చరణ్ , తారక్ మాస్ స్టెప్పులు ఈ పాటకి పెద్ద ప్లస్ గా మారాయి. ఈ పాట ఎంత  హిట్ అయ్యిందో తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ లోకి వెళ్లి నాటు నాటు కవర్ సాంగ్స్ అని టైప్  చేయండి. బాబోయ్ కొన్ని వేల సాంగ్స్ మనకు కనిపిస్తాయి. అంత బాగా రీచ్ అయ్యింది ఈ పాట జనాలకి. ఇక ఈ సినిమా నుండి  రీసెంట్‌గా రిలీజ్ అయిన సోల్ సాంగ్ ‘జనని’. ఈ పాట  విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్‌ని  సొంతం చేసుకుంది.

 ఈ పాటను రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య.. తమిళ వెర్షన్‌ను విడుదల చేశారు. కాగా “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు ఈ పాట లాంచింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు. చెన్నై లో జరిగిన  ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌ లో రాజమౌళి కోలీవుడ్ సినీ మీడియా సోదరులకు సారీ చెప్పారు.  గత 3 సంవత్సరాలుగా వాళ్లతో  ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు జక్కన్న  క్షమాపణలు తెలియజేసారు. జనవరిలో సినిమా రిలీజ్ కు  ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఖచ్చితంగా వారితో మాట్లాడుతానని రాజమౌళి వారికి ప్రామిస్ కూడా  చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: