సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు సీతారామశాస్త్రి. ఆ చిత్రంలోని అన్ని పాటలను రాసి గొప్ప రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పాతుకు పోయారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు పనిచేసి ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అణిముత్యాలాంటి పాటలు రాసే గీత రచయితగా నిలిచిపోయాడు.

ఆయన ఇప్పటివరకు వందల సినిమాలలో రాసి తన పాటలతో ప్రేక్షకులను అలరించగా తొలి సినిమా సిరివెన్నెలతోనే అలాంటి అమోఘమైన పాటలు రాసే అవకాశం దక్కడం నిజం గా గొప్ప వరం అని చెప్పాలి.  గీత రచయిత గా తొలి సినిమా కే ఈ రేంజ్ పాటలు ఇవ్వడం అప్పట్లో దర్శకుడు కత్తి మద సాము లాంటి ప్రయోగం చేశాడని చెప్పవచ్చు. కొత్త గీత రచయిత అంటే ప్రేమ పాటలు పాశ్చాత్య పాటలు అవకాశం ఇస్తారు కానీ ఆయన మీద నమ్మకంతో దర్శకుడు కె.విశ్వనాథ్ గొప్ప పాటలను రాసే అవకాశాన్ని ఆయనకు అందించాడు.

ఇక ఆ సినిమా తరువాత లేడీస్ టైలర్ స్వయంకృషి మహర్షి శృతిలయలు రుద్రవీణ ఆడదే ఆధారం స్వర్ణకమలం శివ బొబ్బిలిరాజా ఆదిత్య369 క్షణక్షణం ఆపద్బాంధవుడు అల్లరి ప్రియుడు గాయం వంటి సూపర్ హిట్ సినిమాలలో పాటలు రాసి తన తర్వాత తరం వారికి మంచి భరోసా ఇచ్చాడు. ఎలాంటి పాటనైనా చాలా లోతుగా విశ్లేషించి ప్రేక్షకులకు అర్థమయ్యే సులువైన పదాలతో రాసి తనలోని గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటాడు. భక్తి పాటలు, రొమాంటిక్ పాటలు అలాగే విప్లవ గీతాలు సైతం సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాస్తే అవి తప్పకుండా గొప్ప పాటలుగా నిలిచిపోతాయి అని పేరు సంపాదించుకున్నాడు. వేటూరి సుందరరామూర్తి తర్వాత ఆయన తర్వాతి తరంలో అంత గొప్ప సాహిత్య వేత్త గా పేరు సంపాదించుకున్నాడు సిరివెన్నల సీతారామ శాస్త్రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: