ప్రముఖ టాలీవుడ్ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉంటారంటే అతిశయోక్తి కాదు. తన కలం నుండి ఎన్నో అద్భుతమైన పాటలు రచించబడ్డాయి. 1986 నుండి తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 35 సంవత్సరాల పాటుగా అన్ని రకాల పాటలను రచించి ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. రెండు మూడు రోజులుగా సిరివెన్నెల ఆరోగ్యం పట్ల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉందని మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఇంటి సభ్యులు సిరివెన్నెల గారు న్యుమోనియాతో మాత్రమే బాధపడుతున్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మొదటి సారి రాసిన సినిమా పాట అనుభవం ఒకటి తెలుసుకుందాం. 1986 లో కె విశ్వనాద్ దర్శకత్వం లో 'సిరివెన్నెల' అనే సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాటల రచయితగా సీతారామశాస్త్రి గారు పనిచేశారు.  ఈ సినిమాలో మొత్తం 9 పాటలు ఈయనే రాశారు. దానికి తోడు కేవి మహదేవన్ సంగీతం తోడవడంతో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.  అయితే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఇందులో రాసిన ఒక పాట గురించి తమ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో  "విధాత తలపున ప్రభవించినది..." అనే పల్లవితో సాగే పాటను రచించడానికి వారం రోజులు పట్టిందట.

ఆ పాటను అంత కష్టపడి రాశారు కాబట్టి...ఈ పాట ఈ నాటికీ అందరి గొంతులో నానుతూ ఉంది. అలా ఆ పాటతో మొదలైన తన సినీ ప్రయాణం నేటికీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాలో పాటలు అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అందుకే ఈ సినిమా నుండి ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారింది. ఆయన ఆరోగ్యం త్వరలోనే కుదుటపడి సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: