టాలీవుడ్ మెల్లగా రూట్ లోకి వస్తోంది. మూలన పడేసినవన్నీ సర్దుకుని ఇపుడు కొత్త ఉత్సాహం నింపుకుంటోంది. టాలీవుడ్ కి ఇపుడు హిట్లు కావాలి. అవి ఒకటీ అరా అసలు చాలవు. చాలా ఎక్కువగానే కావాలి. అయితే ఇంతకంటే మంచి ముహూర్తం వేరేది లేదని టాలీవుడ్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న వేళ మళ్లీ గండాలు ఎదురవుతున్నాయి.

అవును అన్నీ చూసుకుని ట్రిపుల్ ఆర్ ని జనవరి 7న, రాధేశ్యామ్ ని జనవరి 14న రిలీజ్ కి ఫిక్స్ చేశారు. అలాగే భీమ్లా నాయక్ సహా అనేక బిగ్ ప్రాజెక్టులు జనవరి నుంచి మొదలుపెడితే క్యూ కట్టేశాయి. ఈ నేపధ్యంలో సూపర్ కరోనా పేరిట ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తోంది.

ఈ మేరకు ప్రపంచం అంతా ఇపుడు అప్రమత్తం అయింది. ఒమిక్రాన్‌ భయంతో మళ్లీ రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇక షాపింగ్ మాల్స్ తో పాటు బహిరంగ ప్రదేశాలలో కరోనా ప్రోటోకాల్ పాటించమంటూ ఆదేశాలు వస్తున్నాయి. ఇపుడు చూస్తే డిసెంబర్ ముంగిట ఉన్నారు అంతా. మరో నెల రోజులలో ఈ ఆంక్షలు కనుక ఇంకా పెరిగితే జనవరిలో వచ్చే సినిమాల మీద పెద్ద దెబ్బ పడుతుంది అంటున్నారు. ఇక ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీస్. అందువల్ల వాటికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి బాగుంటే సరిపోదు, ఇతర  రాష్ట్రాలు, ఓవర్సీస్ కూడా బాగుండాలి. అపుడే వాటికి పెట్టిన డబ్బు వస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాలు సైతం పొరుగున ఉన్న రాష్ట్రాలు, ఇతర పరిస్థితులను బట్టి గట్టి నిబంధలను తెస్తే కనుక కచ్చితంగా సినిమాలే ముందు టార్గెట్ అవుతాయి. దాంతో ఇపుడు టాలీవుడ్ కి ఒమిక్రాన్‌ గండం పొంచి ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి తీసుకుంటున్నవి అన్నీ ముందు జాగ్రత్త చర్యలే కాబట్టి ఫరవాలేదు. ఒకవేళ కనుక అవి తీవ్రమైతేనే టాలీవుడ్ పెను సవాల్ ని ఎదుర్కుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ పరిస్థితి రాకూడదని అంతా భావిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: