సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొత్తంగా తన కెరీర్ లో 3000 సాంగ్స్ పై గా సాహిత్యం అందించి అందరినీ ఆకట్టుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి తొలిసారిగా జనని జన్మభూమి సినిమా ద్వారా టాలీవుడ్ కి గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు సినిమాలు చేసిన సీతారామశాస్త్రికి కె. విశ్వనాధ్ తీసిన సిరివెన్నెల సినిమా గేయ రచయితగా ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టడంతో పాటు పలు అవార్డులు కూడా అందించడం విశేషం.

ఇక అక్కడి నుండి మరింతగా కెరీర్ పరంగా సినిమాలతో దూసుకెళ్లిన సిరివెన్నెల కొద్దికాలంలోనే తన అద్భుత సాహిత్యంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఇక విషయంలోకి వెళితే, ఎప్పుడూ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండే సిరివెన్నెల ఇటీవల నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో జాయిన్ అయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పలువురు సినెమా ప్రముఖులు, ఆయన అభిమానులు ఆయనకు ఏమి జరిగిందో ఏమో అంటూ ఆందోళన పడుతున్నారు.

కాగా సిరివెన్నల గారికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని, లంగ్స్ లో కొద్దిపాటి సమస్యలు ఉండడంతో ఆయన హాస్పిటల్ లో చేరారని, అయితే డాక్టర్లు అందిస్తున్న చికిత్సకు సిరివెన్నెల గారి శరీరం సహకరించడంతో మెల్లగా ఆయన కోలుకుంటున్నారని, అయన ఆరోగ్యం విషయమై ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు మీడియా కి తెల్పడం జరిగింది. ఇక సిరివెన్నెల అనారోగ్య విషయం తెలుసుకున్న పలువురు సినిమా ప్రముఖులు ఆయనని ఫోన్ ద్వారా వాకబు చేసినట్లు సమాచారం. ఇక దీనిని బట్టి సిరివెన్నెల ఆరోగ్యం మెరుగవుతోందని అర్ధం అవుతోంది. కాబట్టి ఎవరూ కూడా సిరివెన్నెల గారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన మన ముందుకు మళ్ళి చిరునవ్వులతో తిరిగివచ్చి తన సాహిత్యంతో అలరిస్తారని పలువురు సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: