టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుండగా ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కి విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది, ఇప్పటికే బంగార్రాజు సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, పోస్టర్ లను, ఒక లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేలా చేశాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 50 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఈ సినిమా కోసం సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్నట్లు కూ డా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అనేక మంది హీరోయిన్ లు నటిస్తూ ఉండగా వారందరి రెమ్యూనరేషన్ కోసం కూడా భారీ మొత్తం లో కేటాయించడం వల్ల ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే, అందు వల్లనే బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతి కే విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: