బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో నందమూరి అభిమానులు కన్న కల వాస్తవానికి హరికృష్ణ జీవించి ఉన్న రోజులలో ఆయన ప్రోత్సాహంతో కళ్యాణ్ రామ్ ఈ ప్రయత్నాలు చేసాడని అంటారు. అయితే ఎందుకో ఆ ప్రయత్నం సఫలం కాలేదు.


ఇది చాలదు అన్నట్లుగా జూనియర్ బాలయ్యల మధ్య చెప్పుకోతగ్గ అనుబంధం కనిపించక పోవడంతో నందమూరి అభిమానులు బాలయ్య జూనియర్ అభిమానులు అన్న రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే ఇప్పుడు ఈ విభజనతో బాలకృష్ణ బాగా నష్టపోతున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. బాలయ్య సినిమాలకు అతడి అభిమానులు వస్తున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ సినిమాలను పెద్దగా పట్టించు కోవడం లేదు.


దీనితో కలక్షన్స్ రికార్డుల విషయంలో బాలకృష్ణ వెనకపడిపోతున్నాడు. అతడి సినిమాలకు టోటల్ పాజిటివ్ టాక్ వస్తే కాని యూత్ రావడం లేదు. దీనితో బాలయ్య తన వ్యూహాలు మార్చాడ అన్న సందేహాలు అందరిలో కల్గుతున్నాయి. మొన్న జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ తన ‘అఖండ’ మూవీతో పాటు ఈనెలలో విడుదలకాబోతున్న ‘పుష్ప’ ను అదేవిధంగా జనవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను చూసి ఆశీర్వదించండి అంటూ బాలయ్య ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రస్తావన రాగానే రామ్ చరణ్ పేరును ప్రస్తావిస్తూ ‘మన జూనియర్ ఎన్టీఆర్’ అని అనడం తారక్ అభిమానులను జోష్ లో ముంచెత్తివేస్తోంది.


మెగా కుటుంబ హీరోలు అంతా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వారిలో వారిని తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను బాలకృష్ణ అనుసరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ తో సయోధ్యకు సంకేతాలు ఇవ్వడమే కాకుండా త్వరలో పరిచయం కాబోయే తన కొడుకు మోక్షజ్ఞ సినిమాకు జూనియర్ అభిమానుల ప్రోత్సాహం కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్న అభిప్రాయం కలుగుతోంది. అంతేకాదు ఎప్పుడూ నందమూరి వంశం భజన చేసే బాలయ్య ఈసారి రూట్ మార్చి ఇండస్ట్రీలో తాను అందరివాడిని అన్న సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: