అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కు మరొక‌సారి అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వ‌హించిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏండ్ల‌ రెహమాన్‌ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు తనకు ఎంతో సంతోషం క‌లిగించింద‌ని తెలిపాడు. స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత, సంగీత నిర్మాత, సంగీత విద్వాంసుడు, బహుళ వాయిద్యకారుడు, ఏఆర్ రెహ్మాన్ బాలీవుడ్, ఇతర అంతర్జాతీయ సినిమా, థియేటర్ ప్రాజెక్ట్‌లలో కూడా పని చేసారు రెహ‌మాన్‌. చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో ఒకరు ఏఆర్ రెహమాన్‌.  

భారతీయ టీవీ కోసం డాక్యుమెంటరీలు, జింగిల్స్‌కు స్కోర్‌లను కంపోజ్ చేసిన కొన్ని సంవత్సరాల త‌రువాత‌, రెహమాన్ సినిమా కెరీర్ 90ల ప్రారంభంలో తమిళ హిట్ ‘రోజా’తో ఆరంభమైంది. ‘బాంబే’, ‘కదలన్‌’ ‘తిరుడా తిరుడా’, ‘జెంటిల్‌మెన్’తో సహా అనేక చిత్రాలకు హిట్‌ మ్యూజిక్ అందించారు ఆస్కార్ అవార్డు గ్ర‌హిత‌.  2008లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో బిగ్ బ్రేక్ వచ్చిన‌ది. అది ఆయనకు 81వ అకాడమీ అవార్డుల‌లోఉత్తమ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డునును సంపాదించి పెట్టిన‌ది. అదేవిధంగా  రెండు గ్రామీ అవార్డులు, ఒక బాఫ్టా అవార్డు, గోల్డెన్ గ్లోబ్, నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో పాటు అనేక ఇతర అవార్డులను  గెలుచుకున్నారు రెహమాన్.

డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు జ‌రిగే  ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో మూడో రోజు కార్యక్రమాలలో CIFF కైరో ఇండస్ట్రీ డేస్‌లో భాగంగా మధ్యాహ్నం ఈజిప్టు ప్రఖ్యాత స్వరకర్త హిషామ్ నజీహ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పని గురించి చర్చిస్తూ ఓ ప్రత్యేకమైన‌ చర్చ జ‌రిగింది.  ఇందుకి అనేక మంది చిత్రనిర్మాతలు, విమర్శకులు హాజరయ్యారు. సాంస్కృతిక మంత్రి ఇనెస్ అబ్దెల్ దాయెమ్ నాయకత్వం వహించ‌డం.. 63 దేశాల నుంచి 111 చిత్రాలను ప్రదర్శించడం, CIFF  43వ ఎడిషన్ కార్యకలాపాలలో 34 ప్రపంచ ప్రీమియర్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లున్నాయి. అదేవిధంగా  ఈజిప్టు దిగ్గజ స్టార్ నెల్లీని  కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోసత్కరించారు.  ఈజిప్షియన్ స్టార్ నటుడు కరీమ్ అబ్దెల్ వంటి అనేక మంది ప్రఖ్యాత చిత్రనిర్మాతలకు అనేక సన్మాన వేడుకలున్నాయి ఇక్క‌డ.  కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేన్స్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ కూడా గౌరవం అందుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: